రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం : కార్గో నౌకలో చిక్కుకున్న 13 మంది భారత నావికులు

రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా నల్ల సముద్రం పరిసర ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ మరియు క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నడుమ తాము తీవ్ర ప్రాణభయంతో గడుపుతున్నట్లు ‘ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కార్గో నౌకలోని  13 మంది భారతీయ నావికులు సహా మొత్తం 15 మంది సిబ్బంది తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. ‘ఎం.వీ. అమీర్1’ అనే కార్గో నౌక అత్యంత భయంకరమైన మరియు ప్రాణాంతక వాతావరణంలో చిక్కుకుందని ఎఫ్ఎస్‌యూఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నౌకకు సమీపంలోనే పదేపదే డ్రోన్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, ఏ క్షణంలోనైనా నౌకపై ప్రత్యక్ష దాడి జరగొచ్చన్న భయంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితిలో స్పందించి, నావికులను తక్షణమే సురక్షితంగా రక్షించి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం, షిప్పింగ్ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సంఘర్షణ ప్రాంతాల్లో మన నావికులను ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో వదిలేయవద్దని కోరుతూ, నౌక చుట్టూ దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలతో కూడిన వీడియోను కూడా యూనియన్ షేర్ చేసింది. తాజాగా చోర్నోమోర్స్క్ పోర్టులో 13 మంది భారతీయ నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న ఘటనపై అటు భారత విదేశాంగ శాఖ గానీ, ఇటు సంబంధిత షిప్పింగ్ కంపెనీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org