ఎన్‌ఎస్‌జి తొలి చీఫ్ ఆర్.టి. నాగ్రాని కన్నుమూత

దేశంలో అత్యంత శక్తిమంతమైన ఉగ్రవాద నిరోధక సంస్థ 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్' తొలి అధిపతి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్.టి. నాగ్రాని (98) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆర్.టి. నాగ్రాని 1951 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. విమానాల హైజాక్, ఉగ్రదాడులను తిప్పికొట్టడం మరియు బందీల రక్షణే ప్రాథమిక లక్ష్యాలుగా ‘బ్లాక్ క్యాట్స్’ కమాండో దళానికి ఆయన రూపకల్పన చేశారు. 1984 నుండి 1986 వరకు ఎన్‌ఎస్‌జి (NSG) తొలి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ఈ విశిష్ట దళానికి బలమైన నాయకత్వాన్ని అందించారు. దేశ భద్రతలో అత్యంత కీలకమైన ఉగ్రవాద నిరోధక విభాగానికి పునాది వేసిన నాగ్రాని 1987లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, భద్రతా దళాల అధికారులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

Post a Comment

Previous Post Next Post
3