తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ రైల్వే మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి సంబంధించిన వివరాలు, సవరించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు ప్రస్తుతం ప్రతీ బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07097ను ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్ 2వ తేదీల్లోనూ నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ లో ప్రతీ బుధవారం తెల్లవారు జామున 4.20కు బయలుదేరే ఈ రైలు మంగళూరు సెంట్రల్ కు గురువారం ఉదయం 9.30కు చేరుకుంటుంది. అలాగే మంగళూరు సెంట్రల్ నుంచి హైదరాబాద్ కు ప్రతీ గురువారం ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07098ను ఆగస్టు 6, 13, 20,27, సెప్టెంబర్ 3వ తేదీల్లోనూ నడపబోతున్నారు. ఈ రైలు మంగళూరు సెంట్రల్ లో గురువారం రాత్రి 8 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు ఒక రోజు తర్వాత అంటే శనివారం తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ తెలుగు రాష్ట్రాల పరిధిలో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సెడం, యాదగిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురంలో స్టాప్ లు ఉన్నాయి. ఇలా రెండు వైపులా కలిపి 10 అదనపు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
3
Beranda
› from Hyderabad at 4:20 AM every Wednesday
› Indian Railway
› Southern Railway Introduces Additional Trains from Hyderabad to Mangaluru via Andhra Pradesh
› this train arrives at Mangaluru Central at 9:30 AM
› ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్ నుంచి మంగళూరుకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణ రైల్వే
Subscribe to:
Post Comments (Atom)