పేటీఎంలో కొత్త 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తమ యాప్‌లో ‘స్ప్లిట్ బిల్స్’  అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రెండ్‌షిప్ డేకి ముందుగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో గ్రూప్ ఖర్చులను ట్రాక్ చేయడం, విభజించడం, అలాగే ఎలాంటి గందరగోళం లేకుండా సెటిల్ చేసుకోవడం చాలా సులభం కానుంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, స్నేహితుల గ్రూపులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని పేటీఎం ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఫ్రెండ్స్‌తో వెళ్లే రోడ్ ట్రిప్స్, బర్త్‌డే వేడుకలు, సినిమా టికెట్లు లేదా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు వంటి ఉమ్మడి ఖర్చులన్నింటినీ ఇందులో సులభంగా నిర్వహించవచ్చు. ఇందుకోసం పేటీఎం యాప్‌లోని ‘పే ఎనీవన్‌’ సెక్షన్‌కి వెళ్లి ‘స్ప్లిట్ బిల్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేసి, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకుని రోజువారీ లేదా ట్రిప్ ఖర్చులను నమోదు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఖర్చును అందరికీ సమానంగా పంచడమే కాకుండా, నిర్దిష్ట మొత్తం లేదా వాటాల రూపంలో కూడా విభజించుకునే సౌలభ్యం ఉంది. గ్రూప్‌లో ఇప్పటివరకు మొత్తం ఎంత ఖర్చయింది, ప్రతి ఒక్కరి వాటా ఎంత, ఇంకా ఎవరు ఎవరికి ఎంత చెల్లించాలనే వివరాలన్నీ యాప్‌లోనే స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఈ సేవలను వినియోగించుకోవడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని, పరిమితులు కూడా లేవని పేటీఎం స్పష్టం చేసింది. కేవలం పేటీఎం యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులే కాకుండా, ఇతర యూపీఐ యాప్స్, క్యాష్ లేదా కార్డుల ద్వారా చెల్లించిన బిల్లులను కూడా ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఇది ఈ ఫీచర్‌లోని అత్యంత ఉపయోగకరమైన అంశం. ఒకవేళ ఎవరైనా బాకీ పడితే, వారికీ బకాయిలు చెల్లించాలని యాప్ నుంచే సులభంగా రిమైండర్లు పంపవచ్చు. “పంచుకున్న తీపి జ్ఞాపకాలు మాత్రమే గుర్తుండాలి కానీ, డబ్బుల లెక్కల తలనొప్పులు కాదు. ఈ ఫీచర్‌తో యూజర్లకు ఆ అనుభూతిని మరింత చేరువ చేస్తున్నాం” అని పేటీఎం ప్రతినిధి తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం