ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, గూగుల్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు కేంద్రం సమన్లు జారీ

డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ పై వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 3వ తేదీన సోషల్ మీడియా ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుందని కేంద్రం తెలిపింది.ఈ మేరకు కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.  మహిళలు, చిన్నారులు, కార్మికులు, రైతులు సహా ప్రజా భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలి. ఆగస్టు 3, 2026 రోజున సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది' అని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు. నీట్ యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలను ప్రచారం చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ విస్తృతంగా సోషల్ మీడియాలను ఉపయోగించింది. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్ డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయడం, ఆగస్టు 3వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం