ఆగస్టు 6న వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ విడుదల

గస్టు 6న ఎస్2 స్మార్ట్ ఫోన్  వివో  విడుదల చేయనున్నది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఐడియా ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ డిజైన్ వివరాలు అందించింది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే, వెనుక కూడా కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ పై భాగంలో అడ్డంగా ఉంటుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తుంది. వివో ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే , కొన్ని లీక్స్ ద్వారా ఈ వివో అప్ కమింగ్ ఫోన్ Snapdragon 8 Gen 5 తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేయగా, ఈ సెటప్ లో 50MP ప్రధాన సెన్సార్ జత 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, ఇందులో 7,000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్ సపోర్ట్ గురించి కూడా లీక్స్ చెబుతున్నాయి.

Post a Comment

0 Comments