హైదరాబాద్‌లో 10వేలకు పైగా స్టార్టప్స్‌ : పదేళ్లలో మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు : స్టార్టప్‌ రెడీనెస్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి

Telugu Lo Computer
0

దేశంలోని స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, తక్కువ నిర్వహణ వ్యయం, సంస్థాగత సహకారం వంటి అంశాలు నగరాన్ని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టాయని ఎండియా పార్ట్‌నర్స్‌ విడుదల చేసిన 'హైదరాబాద్‌ స్టార్టప్‌ రెడీనెస్‌ ఇండెక్స్‌-2026' వెల్లడించింది. ఆవిష్కరణలకు, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నెలవైన స్టార్టప్స్‌తో దేశంలోనే అగ్రగామి స్టార్టప్‌ హబ్‌గా సిటీ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌ స్టార్టప్‌ ఇండెక్స్‌లోని ఇన్నొవేషన్‌ రిపోర్ట్‌ స్టార్టప్‌ రంగంలో నగర పురోగతికి అద్దం పట్టింది. మొత్తంగా 216 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నగరంలో ఏర్పాటైన స్టార్టప్స్‌ సంఖ్య 10వేలు దాటిందని నివేదిక పేర్కొంది. గత 2014 నుంచి చూస్తే ఈ పన్నెండేళ్లలో 384కు పైగా ఒప్పందాలను ఈ రంగం కుదుర్చుకుందని తద్వారా 3 బిలియన్‌ డాలర్లకు పైగా వెంచర్‌ ఫండింగ్‌ను ఆకర్షించిందని నివేదిక తేలి్చంది. దేశంలోని మొత్తం 'గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్స్‌' (జీసీసీ)ల్లో దాదాపు 20 శాతం అంటే 355కుపైగా కేంద్రాలకు నగరం వేదికగా నిలుస్తోందని నివేదిక వివరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది మౌలిక వసతులు, కనెక్టివిటీనే హైదరాబాద్‌కు అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. అదే విధంగా 38 శాతం మంది నైపుణ్యం కలిగిన ప్రతిభ అందుబాటులో ఉండటం నగర ఘనతగా భావించగా, 36 శాతం మంది తక్కువ వ్యయంతో వ్యాపారం నిర్వహించగలగడం నగరానికి ప్రధాన పోటీ ప్రయోజనాలని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, 33 శాతం మంది పెట్టుబడుల లభ్యత, 29 శాతం మంది మార్కెట్‌ అవకాశాల విస్తరణపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default