మెటా సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటనపై మెటా గ్లోబల్ బృందాన్ని పిలిపించి సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది. మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్‌లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం. సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం. ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం