పేటీఎంలో కొత్త 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్
ప్ర ముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తమ యాప్‌లో ‘స్ప్లిట్ బిల్స్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రెండ్‌షిప్ డేకి ముందుగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో గ్రూప్ ఖర్చులను ట్రాక్ చేయడం, విభజించడం, అలాగే ఎలాంటి గందరగోళం లేకుండా సెటిల్ చేసుకోవడం చాలా సులభం కానుంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, స్నేహితుల గ్రూపులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని పేటీఎం ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఫ్రెండ్స్‌తో వెళ్లే రోడ్ ట్రిప్స్, బర్త్‌డే వేడుకలు, సినిమా టికెట్లు లేదా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు వంటి ఉమ్మడి ఖర్చులన్నింటినీ ఇందులో సులభంగా నిర్వహించవచ్చు. ఇందుకోసం పేటీఎం యాప్‌లోని ‘పే ఎనీవన్’ సెక్షన్‌కి వెళ్లి ‘స్ప్లిట్ బిల్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేసి, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకుని రోజువారీ లేదా ట్రిప్ ఖర్చులను నమోదు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఖర్చును అందరికీ సమానంగా పంచడమే కాకుండా, నిర్దిష్ట మొత్తం లేదా వాటాల రూపంలో కూడా విభజించుకునే సౌలభ్యం ఉంది. గ్రూప్‌లో ఇప్పటివరకు మొత్తం ఎంత ఖర్చయింది, ప్రతి ఒక్కరి వాటా ఎంత, ఇంకా ఎవరు ఎవరికి ఎంత చెల్లించాలనే వివరాలన్నీ యాప్‌ల...