Posts

Showing posts with the label Justice V. Mohana

అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదు : సుప్రీంకోర్టు

Image
అ త్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. పెల్లెట్‌ గన్స్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి యశోవర్ధన్‌ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ వంటి చర్యలు ఫల...

శాంతియుత, చట్టబద్ధమైన ఆందోళన చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది : జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం

Image
ఢి ల్లీలో విద్యార్థులపై పోలీసులు అత్యధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలతో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. "శాంతియుత, చట్టబద్ధమైన ఆందోళన చేసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఉంటుంది. ఆందోళన జరుగుతోందనే కారణంతోనే అధిక బలప్రయోగం లేదా లాఠీఛార్జ్ చేయడం సరికాదు" అని ఆయన స్పష్టం చేశారు. లైవ్ లా నివేదిక ప్రకారం ఈ వ్యాఖ్యలు న్యాయస్థానంలో నేరుగా వెలువడ్డాయి. ఢిల్లీలో జులై 20న 'చలో సంసద్' కార్యక్రమంలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం, ఇతర అధిక బలప్రయోగాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ పేపర్ లీక్, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై నిరసన తెలుపుతూ కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు కదిలారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, టియర్ గ్యాస్, లాఠీలు ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వీడియోల ప్రకారం విద్యార్థులపై దాడులు, పెల్లెట్లను వాడినట్లు విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమ...