Posts

Showing posts with the label India is hosting this summit after a gap of nearly five years

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు :పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు

Image
దే శంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చే ఈ ముగ్గురు అగ్ర నేతలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2019 అక్టోబర్‌లో తమిళనాడులోని మామల్లపురంలో మోడీతో భేటీ అయిన తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైనిక ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన సదస్సులో మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపి ఉద్రిక్తతలకు ముగింపు పలికారు. తాజాగా ఢిల్లీ సదస్సులో పశ్చిమాసియా పరిస్థితులు ప్రధాన అజెండాగా మారనున్నాయి. "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే థీమ్‌తో ...