క్లబ్‌హౌస్ కట్టకపోతే బిల్డర్లు డబ్బులు తిరిగి ఇవ్వాలి : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ
రి యల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే సమయంలో క్లబ్‌హౌస్‌లు, ఇతర సదుపాయాల పేరిట వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత వాటిని నిర్మించకుండా కాలయాపన చేసే బిల్డర్లకు రేరా గట్టి షాక్ ఇచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న క్లబ్‌హౌస్ వంటి సదుపాయాలను నిర్ణీత లేదా సహేతుకమైన సమయంలోగా నిర్మించి అందుబాటులోకి తేకపోతే, దానికి సంబంధించి కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రుసుమును వారికి వెనక్కి తిరిగి ఇచ్చేయాలని అత్యంత కీలకమైన, ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది. ముంబైకి చెందిన ఒక వినియోగదారుడు 2019 అక్టోబరులోనే తన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే, బిల్డర్ క్లబ్‌హౌస్ సదుపాయం కల్పిస్తానని చెప్పి ఫ్లాట్ కొనుగోలుదారుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారు. ఫ్లాట్ ఇచ్చి ఆరేళ్లకు పైగా గడుస్తున్నా క్లబ్‌హౌస్ నిర్మాణం చేపట్టకపోవడంతో బాధితుడు మహారేరాను ఆశ్రయించాడు. బిల్డర్ తన నుంచి డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా క్లబ్‌హౌస్ అందుబాటులోకి తేలేదని, మెంబర్‌షిప్ హక్కులు ఇవ్వలేదని, కాబట్టి వడ్డీతో సహా తన డబ్బులు రీఫండ్ ఇప్పించాలని కోరాడు. దీనిపై బిల్డర్ వాదిస్తూ ఇది ఒక పెద్ద రీడెవలప్‌మె...