Posts

Showing posts with the label అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు

28న తిరుమలకు జగన్మోహన్ రెడ్డి !

Image
ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయించారు. లడ్డూ వివాదం వేళ అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలకు పిలుపునిచ్చారు. లడ్డూ వివాదంలో జగన్ పైన కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న ఈ సమయంలో జగన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. తిరుమల లడ్డూ వివాదం వేళ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే అంశం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చించారు. రాజకీయ దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఈ అంశం పైన విచారణ కోరుతూ డిమాండ్ చేసిన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖల గురించి వివరించారు. ఈ నేపథ్యం లో తాను ఈ నెల 28న తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరుతూ జగన్ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశం విడుదల చేసారు. అందులో.. తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని తగ్గించేలా, టీటీడీ పేరు ప్రఖ్యాతులను...