Ad Code

యూట్యూబ్ ప్రీమియం ధర పెంపు !


యూట్యూబ్ యాడ్స్ తో ఉచిత వీడియోలను చూసే అవకాశం చాలా కాలంగా ఆఫర్ చేస్తోంది. యాడ్స్ లేకుండా మరియు ప్రీమియం కంటెంట్ ను చూడటానికి ప్రీమియం ప్లాన్ ను కూడా అందించింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధర ప్రకటించిన చాలా కాలం తర్వాత ఈ ప్లాన్ రేట్లు పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్, ప్రపంచ అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ గా వర్ధిల్లుతోంది. సింపుల్ గా చెప్పాలంటే యూట్యూబ్ లేని మొబైల్ ఫోన్ ఉండదు. అంతగా యూట్యూబ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అయితే, యూట్యూబ్ కు ఆదాయాన్ని తెచ్చి పెట్టె యాడ్స్ ను వీడియో లలో రన్ చేస్తుంది. యాడ్స్ తో వచ్చే ఉచిత సబ్ స్క్రిప్షన్ తో వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు. యాడ్స్ చూడటానికి ఇష్టపడిని వారి కోసం యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ను కూడా అందించింది. ఈ ప్లాన్ ను నెల, క్వార్టర్ మరియు వన్ ఇయర్ కోసం అందించింది. ఈ ప్లాన్స్ రేటు ఇప్పుడు 15 నుంచి 55 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. నెలకు రూ. 129 రూపాయలుగా ఉన్న ఒక నెల ప్లాన్ ను 15% పెంచి రూ. 149 రూపాయలు చేసింది. అలాగే, రూ. 399 రూపాయలుగా ఉన్న ఒక మూడు నెలల  ప్లాన్ ను 15% పెంచి రూ. 459 రూపాయలు చేసింది. అయితే, ఫ్యామిలీ ప్లాన్ ను మాత్రం భారీగా పెంచేసింది. కేవలం రూ. 189 రూపాయలుగా ఉన్న ఒక నెల ఫ్యామిలీ ప్లాన్ ను 55% పెంచి రూ. 299 రూపాయలు చేసింది. రూ. 79 రూపాయలుగా ఉన్న స్టూడెంట్ నెల వారి ప్లాన్ ను కూడా 12% పెంచి రూ. 89 రూపాయలు చేసింది. ఓవరాల్ గా చూస్తే యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ను 15% నుంచి 50% వరకు పెంచింది గూగుల్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కోసం అధిక రేటు చెల్లించాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu