జియో టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత యూజర్లను ఆకట్టుకోవడానికి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించే పనిలో పడింది. జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్ని నెట్ నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లకు 4జి నెట్ వర్క్ పై రోజుకు 2GB చొప్పున టోటల్ 56 GB డేటాని మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే, డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. 12 ప్రముఖ OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అవేమిటంటే, Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,Fan Code మరియు Hoichoi ఓటీటీ యాప్స్ ను JioTV app ద్వారా చూడవచ్చు. అంతేకాదు, 28 రోజుల జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ తో లభిస్తుంది.
ホーム
/
డైలీ 100SMS
/
అన్ లిమిటెడ్ లాభాలతో జియో 448 ప్రీపెయిడ్ ప్లాన్ !
Wednesday, August 28, 2024
12 ప్రముఖ OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ jio science technology అన్ లిమిటెడ్ లాభాలతో జియో 448 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ 5జి డేటా డైలీ 100SMS
No comments:
Post a Comment