Ad Code

సెప్టెంబర్‌ 9 న మోటోరోలా రేజర్ 50 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల !


సెప్టెంబర్‌ 9 న రేజర్ 50 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేయనున్నట్లు మోటోరోలా వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. మోటోరోలా రేజర్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ గురించి సంస్థ ఇప్పటికే అనేక టీజర్‌లను విడుదల చేసింది. ఇది అమెజాన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.  ఈ స్మార్ట్‌ఫోన్ 3.6 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుందని ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ల సెగ్మెంట్‌లోనే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ కోటింగ్‌ మరియు IPX8 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. గూగుల్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చాట్‌బాట్‌ జెమిని, మోటో AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనా, అమెరికాలో అందుబాటులో ఉంది. భారత్‌ వేరియంట్ కూడా అదే తరహా స్పెసిఫికేషన్‌లు, ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల FHD+ pOLED ఇన్నర్‌ డిస్‌ప్లే, 3.6 అంగుళాల FHD+ pOLED కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. చూడగానే ఆకట్టుకొనే తరహాలో ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300X చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. 30W వైరడ్‌, 15 వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4200mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ఔటర్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా సహా 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో విడుదల కానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో రానుంది.

Post a Comment

0 Comments

Close Menu