ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ ల్లో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను నేరుగా స్మార్ట్ వాచ్ ల్లో డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చని ట్రూకాలర్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ Wear OS తో పని చేసే స్మార్ట్ వాచ్ ల కోసం ట్రూకాలర్ యాప్ ను రీసెంట్ గా ప్రకటించింది. ఈ యాప్ ను నేరుగా డౌన్ లోడ్ చేసుకొని స్మార్ట్ వాచ్ లలో ఉపయోగించుకోవచ్చు. అంటే, స్మార్ట్ వాచ్ తో పని లేకుండా నేరుగా మీ స్మార్ట్ వాచ్ లోనే మీ ఫోన్ చేసే వారి ఐడెంటిఫికేషన్ ను చూడవచ్చు. స్మార్ట్ వాచ్ కోసం ట్రూకాలర్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో 'Truecaller' అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఈ యాప్ ను కనుగొన్న తర్వాత Install చేసుకోవాలి. ట్రూకాలర్ యాప్ Android Wear OS తో పని చేసే Fossil, Samsung మరియు మరిన్ని స్మార్ట్ వాచ్ లలో పని చేస్తుంది. ముందుగా మీ ఫోన్ లో ఉన్న ట్రూకాలర్ ఆండ్రాయిడ్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఈ యాప్ లో యూజర్ ప్రొఫైల్ లోకి వెళ్లి 'Truecaller for Wear' ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఇలా సెలక్ట్ చేయగానే స్మార్ట్ వాచ్ లిస్ట్ తో ఉన్న కొత్త వాచ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డివైజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీ స్మార్ట్ వాచ్ లో ఇన్స్టాల్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ యాప్ ను మీ స్మార్ట్ వాచ్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
0 Comments