దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నేషనల్ ఇండ స్ట్రి యల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆరు ప్రధాన కారిడార్ లతో పాటు వ్యూహాత్మకంగా నిర్మిస్తునాన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డువలప్ మెంట్ ప్రోగ్రాం కింద 12 స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఉత్తరాఖండ్ లోని ఖుర్పియా, పంజాబ్ లోని రాజ్పురా పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్ , యూపీలో ఆగ్రా, ప్రయాగ్ రాజ్, బీహార్ లోని గయా, తెలంగాణలో జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్, కొప్పర్తి, రాజస్థాన్ లోని జోధ్ పూర్ పాళిలో నిర్మించనున్నారు. ఈ పారిశ్రామిక హబ్ లలో రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం, ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.
0 Comments