పారిస్ లో అట్టహాసంగా పారా ఒలపింక్స్ వేడుకలు ప్రారంభం

Telugu Lo Computer
0


పారిస్‌ లో పారా ఒలంపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. డిలా కాంకార్డ్‌ వేదికగా తొలిసారి బహిరంగ ప్రదేశంలో వేడుకలను ప్రారంభించారు. ఈ సంబరాలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌లతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మార్షల్ ఆర్ట్స్ వీరుడు, నటుడు అయిన జాకీ చాన్ ఒలంపిక్స్ జ్యోతితో సందడి చేశారు. ఈ ప్రారంభ వేడుకలను చూడ్డానికి వేల సంఖ్యలో అభిమానులు తలివచ్చారు. ప్రారంభ వేడుకల్లో కార్యక్రమాలు ఎప్పటిలనే ఆకట్టుకున్నాయి. పారా ఒలంపిక్స్ క్రీడలు 11 రోజుల పాటు  జరగనున్నాయి. 168 దేశాలకు చెందిన మొత్తం 4,400 క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌ 8న ఇవి ముగియనున్నాయి. భారత్‌ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో ఈసారి పోటీలో ఉన్నారు. మొదటిసారి భారత్ ఇంత మందితో పారా ఒలిపింక్స్ లో పాల్గొంటోంది. క్రీడాకారులు టోక్యోలోని పారా ఒలంపిక్స్ కు 54 మంది వెళ్లారు. ప్రారంభ వేడుకల్లో పారా ఒలిపింక్స్ స్వర్ణ పతక విజేత సుమిత్‌ అంటిల్‌, ఆసియా పారా క్రీడల రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. టోక్యోలో జరిగిన పోటీల్లో భారత్‌ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 24 స్థానంలో నిలిచింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default