Ad Code

మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా : అజిత్‌ పవార్‌


హారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ''శివాజీ మహారాజ్‌ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా'' అన్నారు. ''గతేడాది నేవీ డే సందర్భంగా మాల్వాన్‌లోని రాజ్‌కోట్‌ కోటలో శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం కూలిన ఘటన ఆయన్ను అభిమానించేవారినీ చాలా బాధించింది. ఈ ఘటనపట్ల బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా. మహారాజ్‌ విగ్రహాన్ని నెలకొల్పేటప్పుడు భౌగోళిక పరిస్థితులు, వాతావరణం వంటి ముఖ్యమైన అంశాలపై శాస్త్రీయమైన అధ్యయనం చేశారా? రాష్ట్ర ప్రభుత్వం విగ్రహ తయారీకి ఉపయోగించిన మెటీరియల్‌ నాణ్యతపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు. గతేడాది డిసెంబరు 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం ఈ విగ్రహం కూలిపోవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని.. శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. మరోవైపు, కూలినచోటే కొత్త విగ్రహం నిర్మిస్తామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. విగ్రహ నిర్మాణం నౌకాదళం పర్యవేక్షించింది తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కాదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu