రూ.270 కోట్లకు పుష్ప-2 ఓటీటీ డీల్ ?

Telugu Lo Computer
0


పుష్ప 2 సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌ లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా తెలుగు సహా అన్ని భాషలకు కలుపుకొని అక్షరాల రూ.270 కోట్లకు డీల్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ డీల్ అంటే మాముులు విషయం కాదు. ఈ లెక్కన్న పుష్ప సీక్వెల్‌పై ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక బెస్ట్‌ యాక్టర్‌గా బన్నీకు, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవికి నేషనల్ అవార్డులు రావడంతో సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default