ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో బండిపై వెళ్తున్న ఇద్దరు మహిళలను కార్ లో వెళ్తున్న కొందరు ఆకతాయిలు అడ్డగించేందుకు ప్రయత్నిస్తూ వేధింపులకు గురిచేసిన ఘటన చోటు చేసుకుంది. వేధింపులకు గురైన బాధితురాలు ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హాల్ద్వాలీలో ఇద్దరు మహిళలు సినిమా చూసి బండిపై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రెండు కార్లలో వచ్చిన ఆకతాయిలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న తెల్ల రంగు కారులో ముందు తలుపులపై ఇద్దరు ఆకతాయిలు కుర్చుని ఆ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలను అడ్డగించే క్రమంలో కార్లను రోడ్డుకు అడ్డుగా పెడుతుండగా ఓ స్కూటీ అటుగా రావడంతో వారు తప్పించుకున్నారు. ఈ మేరకు బాధిత మహిళ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కు రాష్ట్ర పోలీసులను ట్యాగ్ చేసి.. వీడియోలో ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.
ఉత్తరాఖండ్‌లో మహిళలపై ఆకతాయిల వేధింపులు : వీడియో వైరల్
by Telugu Lo Computer at August 28, 2024
Labels:
national
,
ఉత్తరాఖండ్‌లో మహిళలపై ఆకతాయిల వేధింపులు
,
పోస్ట్‌కు రాష్ట్ర పోలీసులను ట్యాగ్ చేసి
,
వీడియో వైరల్
,
సినిమా చూసి బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment