ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రేన్ అనే ఐటీ కంపెనీ దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెయిల్స్పంపించింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్ప్రకటించింది. మాదాపూర్ మైండ్స్పేస్బిల్డింగ్నం.3ఏలోని మూడు, నాలుగు ఫ్లోర్లలో బ్రేన్ ఎంటర్ప్రైజెస్ప్రైవేట్ లిమిటెడ్పేరుతో ఐటీ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్‌లో బ్రాంచ్ లున్నాయి. హైదరాబాద్ బ్రాంచ్‌లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోని 1,500 మందిని తాజాగా తొలగించింది. ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు మండిపడుతున్నారు. బ్రేన్కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్‌నెల మధ్యలో వేశారని చెబుతున్నారు. కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే చెల్లించారన్నారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తాజాగా హెచ్ఆర్ను సంప్రదిస్తే ఈ రోజు రేపు అంటూ మెయిల్స్ పంపించారని, చివరికి ఉద్యోగాల నుంచే తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న బిజినెస్కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని లీడర్షిప్ ఆపరేషన్స్పేరిట మెయిల్స్వచ్చాయని తెలిపారు. సెప్టెంబర్2 వరకు నోటీస్ పీరియడ్‌గా పేర్కొన్నారని చెప్పారు. సెప్టెంబర్ 2లోపు జీతాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్వచ్చాయంటున్నారు. దీనిపై బాధితులు రంగారెడ్డి జిల్లా జాయింట్లేబర్ కమిషనర్‌ను కలిసి కంపెనీపై ఫిర్యాదు చేశారు.
0 Comments