Ad Code

జియో టీవీఓస్‌ లాంచ్‌ !


జియోటీవీ+ స్ట్రీమింగ్ సర్వీస్‌ను జియో ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్ ఆకాష్ అంబానీ లాంచ్‌ చేశారు. ఇది ఇంటరాక్టివ్ ఫీచర్‌లతో లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ కంటెంట్‌ అందిస్తుంది. అలానే జియో స్మార్ట్ టీవీ సెట్-టాప్ బాక్స్ కోసం జియో టీవీఓఎస్‌ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా లాంచ్‌ చేశారు. జియో ప్లాట్‌ఫామ్‌ సొంతంగా అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ టీవీలో ఫాస్టర్‌ పర్‌ఫార్మెన్స్‌ అందిస్తుంది. ఇంట్లో హాయిగా కూర్చుని టీవీలో బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందేందుకు చాలా రకాల ఫీచర్లను అందిస్తుంది. జియో టీవీఓస్‌ వినియోగదారుల వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరిచే అనేక అప్‌గ్రేడ్ ఫీచర్‌లతో వస్తుంది. ఇది ఇప్పుడు 4K వీడియో క్వాలిటీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. టీవీలో ఉత్తమ పిక్చర్‌, సౌండ్‌తో సాటిలేని అనుభూతిని అందిస్తుంది. జియో టీవీఓఎస్‌ కేవలం టీవీ ఛానెళ్లను మాత్రమే అందించదు. మరిన్ని రకాల కంటెంట్‌లను ఆఫర్‌ చేసే ఎకోసిస్టమ్‌గా మార్చారు. లైవ్ టీవీ ఛానెళ్లను బ్రౌజ్ చేయవచ్చు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. మరొక ప్రధాన అప్‌గ్రేడ్ జియో హోమ్ IoT సొల్యూషన్స్‌ ఇంటిగ్రేషన్‌. దీంతో హోమ్ సిస్టమ్‌లను ఒకే సెంట్రల్‌ ప్లేస్‌ నుంచి కంట్రోల్‌ చేయవచ్చు. అంటే లైట్లు, ఎయిర్ కండిషనర్లు, సెక్యూరిటీ సిస్టమ్‌లు, వివిధ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్‌ చేయవచ్చు, మేనేజ్‌ చేయవచ్చు. ప్రతి డివైజ్‌కి వేర్వేరు యాప్‌లు లేదా రిమోట్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ స్మార్ట్ టీవీ లేదా సెట్-టాప్ బాక్స్ నుంచి కంట్రోల్‌ చేసే అవకాశం ఉంది. జియో టీవీఓఎస్‌ మీ టీవీ నుంచి బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియ్స్‌ని కూడా అందిస్తుంది. ప్లాట్‌ఫామ్ కొత్త ఏఐ- పవర్డ్ హలోజియో అసిస్టెంట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్‌ను అందిస్తుంది. ఈ అసిస్టెంట్‌కి కన్వర్జేషన్స్‌ చేసే సామర్థ్యం ఉంది, అచ్చం మనిషిలానే మాట్లాడుతుంది. మీరు యాక్షన్ సినిమాలు చూడాలనుకుంటే టైప్‌ చేయాల్సిన అవసరం లేదు, నిమిషాల కొద్దీ సెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వాయిస్ కమాండ్‌ ఇస్తే సరిపోతుంది. ఏ ఓటీటీ ప్లామ్‌లో ఉందని వెతికే పని లేకుండా, అన్ని యాక్షన్‌ సినిమాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతుంది. జియో టీవీఓఎస్‌ దాని సొంత జియో యాప్ స్టోర్‌తో వస్తుంది. సెట్-టాప్ బాక్స్‌లో బిల్ట్‌ ఇన్‌ ఫీచర్‌గా ఉంటుంది. ఇందులో పిల్లల కోసం అనేక రకాల యాప్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌ ఇలా చాలా కేటగిరీల అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

0 Comments

Close Menu