కొంత మంది చికెన్‌తో భోజనం చేశాక లాస్ట్‌లో పెరుగుతో ముగించేస్తారు. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయట. అందుకే ఈ రెండింటి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే చాలా మంది పెరుగు వేసి చికెన్ వండుతుంటారు. ఇలాంటి అలవాటు ఉంటే కచ్చితంగా మానుకోవాలి అంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును కలపడం వల్ల మాత్రం నష్టమే ఎక్కువ ఉందని నిపుణులు అంటున్నారు. చికెన్ వల్ల శరీరంపై వేడి ప్రభావం ఉంటే పెరుగు వల్ల చల్లని ప్రభావం ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థపై పడతాయి. ఈ ప్రభావం చెడుగా ఉంటుంది కాబట్టి వీటిని మిక్స్ చేయడం మంచిదికాదంటున్నారు. చికెన్ తిన్న తర్వాత పాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవడం కొందరికి అలవాటు. అయితే చికెన్ తిన్న రోజు పాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలను తాగకుండా ఉండడం మంచిదంటున్నారు.
0 Comments