గ్లోబల్ మార్కెట్లలో నోకియా మాతృ సంస్థ హెచ్ఎండీ బార్బీ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఒక క్లాసిక్ ఫ్లిప్ ఫోన్. దీన్ని బార్బీ థీమ్ తో డిజైన్ చేశారు. పూర్తిగా పింక్ బాడీ, పింక్ బ్యాటరీ, పింక్ ఛార్జర్ తో వచ్చింది. దీన్ని ప్రత్యేకమైన జ్యుయలరీ బాక్స్ లో విక్రయించనున్నారు. ఇందులో హ్యాండ్ సెట్, బీడెడ్ లాన్యార్డ్స్, ఛార్మ్ స్, రెండు అదనపు బ్యాక్ కవర్లు, స్టిక్కర్లు, జెమ్స్ ను కూడా అందించారు. ఈ ఫ్లిప్ ఫోన్ ఎక్స్ టర్నల్ డిస్ ప్లే వైపు అద్దం కూడా బిగించారు. ఈ ఫోన్ లో బీచ్ థీమ్డ్ మాలిబు స్నేక్ గేమ్ ను అందించారు. దీని ధరను 129 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.10,800) నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. సింగిల్ పవర్ పింక్ కలర్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ, యూఎస్ బీ టైప్-సీ ఛార్జర్ ను కూడా పింక్ కలర్ లోనే అందించారు. ఇందులో 2.8 అంగుళాల క్యూవీజీఏ మెయిన్ డిస్ప్లేను, 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ కవర్ స్క్రీన్‌ను అందించారు. దీని ఔటర్ డిస్ప్లేను అద్దంగా ఉపయోగించుకోవచ్చు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 64 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. బార్బీ థీమ్డ్ యూఐపై పని చేసే ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. కీప్యాడ్ ఐకానిక్ బార్బీ పింక్ షేడ్ లో రానుంది. పామ్ ట్రీస్, హార్ట్ సింబల్స్, ఫ్లెమింగో డిజైన్స్ ను కూడా చూడవచ్చు. ఫోన్ ఆన్ చేయగానే హాయ్ బార్బీ అని ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. బీచ్ థీమ్ ఉన్న మాలిబు స్నేక్ గేమ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 0.3 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా అందించారు. ఫోన్లో 1450 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే తొమ్మిది గంటల టాక్ టైమ్ అందించనుంది. 4జీ, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 1.89 సెంటీమీటర్లు కాగా, బరువు 123.5 గ్రాములుగా ఉంది.
గ్లోబల్ మార్కెట్లలో హెచ్ఎండీ బార్బీ ఫోన్ విడుదల !
by Telugu Lo Computer at August 28, 2024
Labels:
nokia
,
science
,
technology
,
గ్లోబల్ మార్కెట్లలో హెచ్ఎండీ బార్బీ ఫోన్ విడుదల
,
ఛార్మ్ స్
,
ప్రత్యేకమైన జ్యుయలరీ బాక్స్ లో విక్రయం
,
బార్బీ థీమ్ తో డిజైన్
,
బీడెడ్ లాన్యార్డ్స్
,
హ్యాండ్ సెట్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment