తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలు, హెల్త్ కార్డుల మంజూరి ప్రక్రియను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రహదారి బంగ్లాలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐ ఎన్ పి ఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో మూడు దఫాలుగా చర్చలు జరిపామని, ఈ చర్చలో భాగంగా ఒక హైపవర్ కమిటీని ఏర్పాటుచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రూట్ క్లియర్ చేసినట్టు వెల్లడించారు. సెప్టెంబర్ మొదటి వారంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల మంజూరి విషయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అక్రిడేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా 25వేల పైచిలుకు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఉన్నందున ఈలోపు నూతన అక్రిడేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక అక్రిడేషన్లు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్ట్ సొసైటీ 70 ఎకరాల స్థలం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పట్ల నిబద్ధతగా ప్రభుత్వం ఉందన్నారు. పట్టణంలోని రహదారి బంగ్లాలో ఆయనకు ఘన స్వాగతం పలికి మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా హుజూర్ నగర్ విచ్చేసిన కే శ్రీనివాస్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలో శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు.
త్వరలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు !
by Telugu Lo Computer at August 29, 2024
Labels:
telangana
,
త్వరలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు
,
మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి
,
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారని
,
హెల్త్ కార్డులు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment