తిరుమల లోశ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్టు చెప్పారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలు విక్రయిస్తామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డూ విక్రయ విధానం కొనసాగుతుందన్నారు.
0 Comments