మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి : మోహన్ లాల్

స్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తోన్న నేపథ్యంలో.. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌'ను లక్ష్యంగా చేసుకోవద్దని 'అమ్మ' మాజీ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు. అన్ని ప్రశ్నలకు 'అమ్మ' సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అమ్మ అనేది ట్రేడ్ యూనియన్ కాదని ఇది ఒక కుటుంబం లాంటిదని మోహన్ లాల్ అన్నారు. అమ్మ అసోసియేషన్‌పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని మోహన్ లాల్ స్పష్టం చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org