పిఠాపురం కౌన్సిల్‌ భేటీలో అధికారులు బాహాబాహీ!


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఈ భవాని శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్‌పై కమిషనర్‌ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని చివరికి అందరూ చూస్తుండగానే బాహాబాహీకి దిగారు.

Post a Comment

0 Comments