ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత, పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
0 Comments