ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి కొండచిలువను మెడకు చుట్టుకుని నలుగురిలో ప్రదర్శిస్తూ డబ్బు సంపాదించేవాడు. ఈ క్రమంలోనే అందరూ చూస్తుండగా కొండచిలువను మెడకు వేసుకుని ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు అది అతడి మెడను గట్టిగా నులిమేసింది. దీంతో ఊపిరాడక ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని హేమంత్ సింగ్గా గుర్తించారు. కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
0 Comments