టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 చేరుకొని జింబాబ్వే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మెగా టోర్నీలో వరస విజయాలతో దూసుకెళ్తున్న ఆతిథ్య జట్టు శ్రీలంకకు హోం గ్రౌండ్‌లోనే జింబాబ్వే భారీ షాకిచ్చింది. కొలంబో వేదికగా జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకను మూడు బంతులు ఉండగానే 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లకు గాను ఏడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. నిషాంక (62) అర్ధ సెంచరీ కొట్టాగా, రత్తైనాయక్ (44), పెరీరా (22) రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఓపెనర్ బెన్నెట్ (63) అజేయ అర్ధ సెంచరీతో మెరిశాడు. మారుమణి (34), కెప్టెన్ సికందర్ జా (45) పరుగులతో ఉత్తమ ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్-బి నుంచి లంకేయులు, జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించాయి. గ్రూప్ దశలోనే పెద్ద జట్లకు భారీ షాకులిస్తున్న జింబాబ్వే..సూపర్-8లో ఏ టీంను టైటిల్ బరిలో నుంచి దూరం చేస్తుందో చూడాలి. సూపర్-8లో భాగంగా భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండిస్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో టీమిండియా ఆడనుంది.
0 Comments