రియల్ మీ 13 5జీ, రియల్ మీ 13+ 5జీ విడుదల !


దేశీయ మార్కెట్లోకి  రియల్ మీ 13 5జీ, రియల్ మీ 13+ 5జీ పేరిట రెండు ఫోన్లను విడుదల చేసింది. ఆకర్షణీయమైన స్టైలిష్ డిజైన్ తో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో వీటిని ఆవిష్కరించి ఆకట్టుకుంది. రియల్ మీ 13 5 జీ స్మార్ట్ ఫోన్ డిస్​ ప్లే 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఎల్సీడీతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 580 నిట్స్ బ్రైట్ నెస్ ను అందిస్తోంది. 6 ఎమ్ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్​తో నడుస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ దీని సామర్థ్యం. ఈ స్మార్ట్ ఫోన్​లో 50 మెగా పిక్సల్​ డ్యుయెల్ రియర్ కెమెరా, శాంసంగ్ S5KJNS మెయిన్ సెన్సర్ తో వస్తోంది. 16 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరాను కూడా అమర్చారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో యూజర్స్​కు అందుబాటులో ఉంచారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీని ధర రూ.17,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధరను రూ.19,999గా తెలిపింది. డార్క్ పర్పల్, స్పీడ్ గ్రాన్ రంగుల్లోనూ కూడా ఇది మార్కెట్​లో లభిస్తోంది. రియల్ మీ 13 5 జీలో ఉన్న బ్యాటరీ, కెమెరా ఫీచర్లే రియల్ మీ 13 + 5జీ స్మార్ట్ ఫోన్లోనూ ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఓఎల్ఈడీ డిస్ ప్లేను వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 2,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. 4 ఎమ్ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్​తో నడుస్తోంది. తడి చేత్తోనూ ఫోన్​ను వాడేందుకు వీలుగా అనుకూలంగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ తో ఇది నడుస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీని సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.24,999గా, 12జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.26,999గా సదరు కంపెనీ తెలిపింది. స్పీడ్ గ్రాన్, డార్క్ పర్పల్, విక్టరీ గోల్డ్ కలర్స్​లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఈ రెండు కొత్త ఫోన్లు ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే మొదలైపోయ్యాయి. యూజర్స్ బుక్ చేసుకోవడం ప్రారంభించేశారు. ముందుగా బుక్ చేసుకోవాలనుకునే వారు రియల్మీ ఇండియా వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో బుక్ చేసుకునే వీలును కల్పించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లకు ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందేలా వెసులుబాటును కల్పిస్తోంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains