Ad Code

ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత !


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు ఐదు నెలలు తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న  బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు ఆమె హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు. బంధువులు, కుటుంబ సభ్యులు పూల వర్షం కురిపించి కవితకు ఘన స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత నేరుగా పూజ గదికి వెళ్లి దేవుళ్లకు దండం పెట్టుకున్నారు. కవితను కలిసిన వెంటనే తల్లి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కూతురిని ఆప్యాయంగా హత్తుకున్నాక తల్లి శోభ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిని పట్టుకుని కవిత కూడా ఏడ్చారు. కుటుంబ సభ్యులు ఓదార్చారు. తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆమె రాఖీ కట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu