Ad Code

కేంద్రీయ విద్యాలయాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ !


దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో నాణ్యమైన భోదనతో పాటు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు డిజిటల్ విద్యపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా కంప్యూటర్లను అందుబాటులో ఉంచాయి. కేంద్రీయ విద్యాలయాల్లోని కంప్యూటర్ల సంఖ్య, ఇతర వివరాలు కేంద్రీయ విద్యాలయ www.kvsangathan.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఆర్మీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే, లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. వీటిలో ఏకంగా 76,795 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ల్యాబ్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం కంప్యూటర్ల సంఖ్య 64,098. ఈ ఫెసిలిటీస్‌తో విద్యార్థులను డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రోత్సహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 13,37,614 కాగా.. విద్యార్థులు, కంప్యూటర్ల నిష్పత్తి 17:1గా ఉంది. అంటే ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక కంప్యూటర్ ఉంది. 99.52 శాతం కేంద్రీయ విద్యాలయాల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. 99.92 శాతం కేవీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. 98.40 శాతం స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. అన్ని కేవీలకు స్పెషల్ వెబ్‌సైట్‌ ఉంటుంది. 13,011 ఈ-క్లాస్‌రూమ్స్, 928 అడ్వాన్స్‌డ్ సైన్స్ ల్యాబ్స్, 376 డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్స్‌తో కేవీలు ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu