స్మార్ట్ ఫోన్ పాస్‌వర్డ్ ను మర్చిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యకు గూగుల్ సాయం చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కు ఈ అవకాశం ఉంది. ఇందుకు స్మార్ట్ ఫోన్ లో లాగిన్ అయిన గూగుల్ అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్ తెలిసి ఉండాలి. దీంతోపాటు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ను కలిగి ఉండాలి. ఈ పద్దతి ద్వారా సులభంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. ఇతర స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. అనంతరం అడ్రస్ బార్‌లో Android.com/find అని టైప్ చేసి, ఎంటర్ చేసి గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. అక్కడ మీరు Reset చేయాలని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్ ను ఎంచుకోవాలి. తరువాత 'ఫ్యాక్టరీ రీసెట్ డివైస్' ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.
0 Comments