Ad Code

మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో భారతీయ ఉద్యోగిపై జాత్యహంకార దూషణలకు పాల్పడిన కెనడియన్ !


కెనడాలోని ఓక్‌విల్ నగరం, మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో భారతీయ ఉద్యోగిపై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా జాత్యహంకార దూషణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఓ వ్యక్తి భారతీయ ఉద్యోగిని ఉద్దేశించి "వెంటనే నీ దేశానికి తిరిగి వెళ్లిపో.. అసహ్యకరమైన భారతీయుడా" అంటూ అనుచిత పదజాలంతో దూషించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ అతడిని అడ్డుకుని ప్రశ్నించగా, ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన దూషణలను కొనసాగించాడు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి.ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇది చాలా దారుణం. మా సమాజంలో ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ ఉద్యోగి ధైర్యంగా నిలబడటం అభినందనీయం" అని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం, "ఇది నిజమైన జాత్యహంకారమా? లేక యువత కేవలం రెచ్చగొట్టడానికి ఇలా ప్రవర్తిస్తున్నారా?" అని సందేహం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu