'కార్పొరేట్ జియోఫై' పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన జియో !


రిలయన్స్ జియో చిన్న & మధ్య తరహా వ్యాపారాల కోసం 'కార్పొరేట్ జియోఫై'  పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ నెలకు రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 299 ప్లాన్‌లో నెలరోజులు 35 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రూ. 349 ప్లాన్‌లో నెలరోజులు 50 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రూ. 399 ప్లాన్‌లో నెలరోజులు 65 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లుపొందవచ్చు అంతే కాకుండా జియోఫై డివైజ్ కూడా ఉచితంగా ఇస్తుంది. దీనిని ఉపయోగించిన తరువాత తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ జియోఫైలో రూటర్ M2S బ్లాక్ పరికరం, ఒక చిన్న వై-ఫై యూనిట్ ఉంటాయి. ఇది 2300/1800/850 MHz బ్యాండ్‌లలో 4G LTEకు సపోర్ట్ చేస్తుంది. ఈ చిన్న వైఫై యూనిట్ ద్వారా 10 వైఫై పరికరాలు, ఒక USB డివైజును కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోని 2300 mAh బ్యాటరీ 5 నుంచి 6 గంటల పాటు ఇంటర్నెట్ వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇది జియోకాల్ యాప్, ఫైల్ షేరింగ్, వన్-టచ్ WPS సెటప్ వంటి ఫీచర్స్ కలిగి వుంది.


No comments:

Post a Comment

3