ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు సమీపంలో 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వున్న మిరియాల లక్ష్మయ్య ఏ1గా, ఏ2గా వున్న బస్సు యజమాని కోసం పోలీసుల గాలిస్తున్నారు. డ్రైవర్ అర్హత లేకున్నప్పటికీ మిరియాల లక్ష్మయ్య హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు. మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది.
వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
October 29, 2025
0
Tags