కేంద్ర ప్రభుత్వ అందజేసే గ్యాస్ సబ్సిడీ కోసం ఎల్పీజీ గృహ వినియోగదారులు ప్రతి ఏటా ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని చమురు కంపెనీలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులు సహా గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ (హిందూస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం) మొబైల్ యాప్ ద్వారా దీనిని (బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ) చేయించుకోవచ్చని వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేస్తే ఆ సబ్సిడీని తిరిగి చెల్లిస్తారు. అలా కాకుంటే ఈ సబ్సిడీ శాశ్వతంగా రద్దవుతుందని పేర్కొన్నాయి. గడువులోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ఇప్పటికే కేంద్ర పెట్రోలియం గ్యాస్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చమురు కంపెనీలకు ఇప్పటికే సూచనలు చేసింది. ఈ-కేవైసీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి చేయించడం తప్పనిసరని తెలిపింది. కేంద్రం ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే రాయితీ ఇస్తుంది. కానీ, 8, 9వ సిలిండర్లకు అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ విడుదల చేస్తోంది. ఒకవేళ ధ్రువీకరణలో జాప్యం జరిగితే తాత్కాలికంగా నిలిపివేస్తారు. గ్యాస్ ఏజెన్సీ లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉండే ఈ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. సబ్సిడీ, ఈ-కేవైసీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ గురించి పూర్తి వివరాల కోసం https://www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ మూడింటిలో ఏదో విధానాన్ని ఎంచుకని ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ దుర్వినియోగం, లీకేజ్‌ను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 879. ఉజ్వల్ వినియోగదారులు రూ. 300 సబ్సిడీని పొందుతుండగా, ఇతర వినియోగదారులు మాత్రం దాదాపు రూ.20 వరకు సబ్సిడీ పొందుతున్నారు. 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసిన వారు సహా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఆ ఈ-కేవైసీ మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 14.2 కిలోల LPG సిలిండర్‌పై సబ్సిడీ పొందాలంటే, ఇది తప్పనిసరి. ఈ సబ్సిడీ 8, 9వ రీఫిల్‌ల వరకు వర్తిస్తుంది.' కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది.
0 Comments