శ్రీశైలం గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు !


నీటిపారుదల శాఖ అధికారులు ఈ ఏడాదిలో మరోసారి శ్రీశైలం జలాయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల, హాంద్రీ నుండి వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం నుండి ఈ ఏడాది ఏడోవ సారి రేడియల్ గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 68,691 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 90,293 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగాఉంది.. పూర్తిస్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 213.4011 టీఎంసీలుగా ఉంది.. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.. 

No comments:

Post a Comment

3