తెలంగాణలో ఎన్ హెచ్ 44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లింపులను సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అక్టోబర్ 30, గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ డైవర్షన్లు, ఆల్టర్నేట్ రూట్లు దాదాపు 9 నెలలపాటు బంద్ కానున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయినంత కాలం రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్- బాలమ్రాయ్ మధ్య ఇరు వైపులా డైరెక్షన్ లను మూసివేయనున్నారు. వాహనదారులు బాలమ్రాయ్- సీటీఓ జంక్షన్ మధ్య ప్రయాణించొద్దని సూచనలు చేశారు. వీళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ విషయాలను జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు. బాలానగర్ నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ కువెళ్తున్న వాహనదారులు తాడ్ బండ్, మస్తాన్ కేప్, డైమండ్ పాయింట్, రైట్ టర్న్, మడ్ ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ గుండా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సుచిత్ర నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వచ్చే వాహనదారులు సేఫ్ ఎక్స్ ప్రెస్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని బాపూజీ నగర్- సెంటర్ పాయింట్- డైమండ్ పాయింట్- మడ్ ఫోర్ట్- ఎన్సీసీ- జేబీఎస్- ఎస్బీఐ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ట్యాంక్ బండ్/ రాణిగంజ్/పంజాగుట్ట/రసూల్ పూరా/ ప్లాజా నుంచి తాడ్ బండ్ వైపు వయా సీటీఓ జంక్షన్ కు వెళ్లేవారు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి అన్నా నగర్- బాలమ్రాయ్- తాడ్ బండ్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అన్నా నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్.. వాహనదారులు పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే వాహనదారులు మీటింగ్ పాయింట్ బై లైన్, హాకీ గ్రౌండ్ బై లైన్, లేదా ఎల్ అండ్ ఓ పోలీస్ స్టేషన్ బై లైన్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఎన్ హెచ్ 44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ : ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లింపు
by Telugu Lo Computer at October 30, 2025
Labels:
hyderabad
,
NH 44 Elevated Corridor Project
,
telangana
,
Traffic diversion from Paradise Junction to Dairy Farm Road
,
will be closed for about 9 months
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment