సోవియట్ యూనియన్‌లోని అణు కర్మాగారం కుప్పకూలడంతో 1986లో చెర్నోబిల్ అణు విపత్తు ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఫోటోలు షాకింగ్‌కి గురిచేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న కుక్కలు నీలిరంగులోకి మారుతున్నాయి. ఈ చిత్రాలను డాగ్స్ ఆఫ్ చెర్నబిల్ అనే సంస్థ షేర్ చేసింది. ఈ కుక్కలు అణు విపత్తు తర్వాత ఈ ప్రాంతంలో మిగిలిపోయి ఉన్నాయి. చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్లో ఇవి మనుగడకు చిహ్నాంగా మారాయి. అణు విపత్తు జరిగిన తర్వాత ఈ ప్రాంతం నుంచి మనుషులు దాదాపుగా బయటకు వచ్చారు. అయితే, వీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. అణు విపత్తు జరిగిన ప్రాంతం చుట్టూ, రేడియేషన్ కారణంగా 18 చదరపు మైళ్ల ఎక్స్‌క్లూజన్ జోన్ ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న కుక్కల్లో మూడు కుక్కలు నీలిరంగు బొచ్చులో కనిపించాయి. ఇలా ఆకస్మికంగా అసాధారణంగా రంగు మార్పు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణాలు తెలుసుకోవడానికి పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరిస్తున్నారు.
చెర్నోబిల్‌లో నీలం రంగులోకి మారిన కుక్కలు
by Telugu Lo Computer at October 28, 2025
Labels:
Chernobyl nuclear disaster occurred in 1986 after the collapse of a nuclear power plant in the Soviet Union
,
Dogs Turn Blue in Chernobyl
,
international
,
rusia
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment