ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 17 ఏళ్ల క్రికెటర్ బెన్ ఆస్టిన్ తలకు బంతి తగలడంతో మరణించాడు. మంగళవారం మధ్యాహ్నం బెన్ మెల్బోర్న్ లోని ఫెర్న్ ట్రీ గల్లీలోని వ్యాలీ ట్యూ రిజర్వ్ గ్రౌండ్ లో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నివేదికల ప్రకారం, అతను పూర్తి భద్రతతో హెల్మెట్ ధరించి బౌలింగ్ మెషిన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అప్పుడు వేగంగా వచ్చిన బంతి అతని తల,మెడ మధ్య భాగంలో తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని తీవ్ర స్థితిలో మొనాష్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా బుధవారం నాడు అతను మరణించాడు.
0 Comments