తెలంగాణ లోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
హనుమకొండ, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ !
by Telugu Lo Computer at October 29, 2025
Labels:
Janagama districts
,
Meteorological Department issues red alert for Hanumakonda
,
orange alert has been issued for 11 more district
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment