ఢిల్లీలో యమునా నది శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియో (రీల్) చిత్రీకరిస్తుండగా పత్పర్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి అదుపుతప్పి నదిలో పడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం మరింత పెరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సంజీవ్ ఝా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, "బహుశా అబద్ధాలు, ప్రచార రాజకీయాలతో విసిగిపోయిన యమునా మాత స్వయంగా వారిని తన వద్దకు పిలిపించుకున్నట్టుంది" అని చురక అంటించారు.
0 Comments