Ad Code

'క్రోమా’లో ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రో పై డిస్కౌంట్ ఆఫర్


దేశీయ మార్కెట్లో గత నవంబర్ లో ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రో లాంచ్ అయినపుడు 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. ఇప్పుడు క్రోమా వెబ్‌సైట్‌లో కేవలం రూ.86,999కి అందుబాటులో ఉంది. అలానే బ్యాంకు ఆఫర్స్ అదనంగా ఉన్నాయి. ఇదే ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.94,999కి అందుబాటులో ఉంది. 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ మాత్రమే ఉంది. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15తో రన్ అవుతుంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వచ్చిన తొలి ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. దాంతో ఇది సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అలర్ట్‌ స్లయిడర్‌తో సహా ఐపీ68/ఐపీ69 రేటింగ్‌తో వచ్చింది. పెరల్‌ వైట్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 కెమెరా ఉంటుంది. 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోపిక్‌ 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, 6 ఎక్స్‌జూమ్‌ 50 ఎంపీ సెన్సర్‌ కెమెరాలు ఉన్నాయి. మొత్తంగా నాలుగు సెన్సర్లు ఉంటాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5,910 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 50W ఎయిర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే 10W రివర్స్‌ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu