నల్లమలలో 154 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన అడవి దున్న


ల్లమల అటవీ ప్రాంతంలో గతేడాది అడవి దున్న కనిపించింది. వెలుగోడు రేంజ్‌లో మొదట కనిపించిన ఈ దున్న, ప్రస్తుతం బైర్లూటి ఎకో టూరిజం పరిసరాల్లో తిరుగుతోంది. కర్ణాటక నుంచి కృష్ణానదిని దాటుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. అడవి దున్న పశ్చిమ కనుమల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అంతరించిపోతున్న అడవి దున్నల్ని (గౌర్‌) సంరక్షణ కోసం సిద్ధమైంది. నల్లమల అడవుల్లోకి దేశీయ అడవి దున్నల్ని తీసుకురావాలని నిర్ణయించారు. మూడు నుంచి నాలుగు బ్యాచ్‌లుగా అడవి దున్నల్ని తీసుకొచ్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. 2024 జనవరిలో పశ్చిమ కనుమల ప్రాంతం నుంచి ఒక అడవి దున్న, వందల కిలోమీటర్లు ప్రయాణించి, పాపికొండల అటవీ ప్రాంతం మీదుగా నల్లమలలోకి ప్రవేశించింది. దీంతో నల్లమల అడవుల్లో (అడవి దున్నల్ని) గౌర్‌ల పునరాగమనంపై ఆశలు పెరిగాయి. అందుకే నల్లమల అడవుల్లో అడవి దున్నల సంఖ్యను పెంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జన్యు వైవిధ్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి అడవి దున్నలను తరలించనున్నారు. త్వరలో ఐఎఫ్‌ఎస్ కమిటీ రానుందని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పాపికొండలు, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి మూడు విడతలుగా ఒక్కోసారి 40 చొప్పున మొత్తం 120 దున్నలను తీసుకురానున్నారు. ఈ దున్నల సంరక్షణ కోసం ఆత్మకూరు, గిద్దలూరు అటవీ డివిజన్ల పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఎన్‌క్లోజర్‌లో దున్నల మెడకు శాటిలైట్ పరికరాలను అమర్చుతారు. దీని ద్వారా వాటి ఆరోగ్యం, అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. మొదటగా, ఈ దున్నలను ఎన్‌క్లోజర్‌లో ఉంచి, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. దాదాపు నెల రోజుల పాటు పర్యవేక్షణ అనంతరం, వాటిని అడవిలోకి వదిలిపెడతారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లమల అడవుల్లో 158 ఏళ్ల తర్వాత మళ్లీ అడవి దున్నలు (గౌర్‌లు) కనిపించనున్నాయి. వీటిని ఇండియన్‌ బైసన్‌గా కూడా పిలుస్తారు. 800 కిలోల బరువుండే ఈ గౌర్‌లు సింహాలను కూడా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాయి.. గుంపులుగా తిరుగుతుంటాయి. 1867లో వేల సంఖ్యలో ఉన్న ఈ గౌర్‌లు 20వ శతాబ్దంలో కనుమరుగయ్యాయి. గాలికుంటు వంటి వ్యాధుల వల్ల ఇవి అంతరించిపోయి ఉండవచ్చని అప్పట్లో భావించారు. అయితే ఇటీవల పశ్చిమ కనుమల నుంచి ఒక గౌర్ నల్లమలలోకివచ్చింది. ఈ అడవి దున్నలు అడవులను కాపాడటంలో చాలా ముఖ్యమైనవని చెబుతుంటారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org