నథింగ్ ఫోన్ 3a లైట్ అధికారికంగా విడుదలైంది. నథింగ్ ఫోన్ సిరీస్ ప్రత్యేకతగా నిలిచిన "గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లైటింగ్ సిస్టమ్"కు బదులుగా, 3a లైట్‌లో కేవలం ఒకే LED డాట్ లైట్ వెనుక భాగంలో అమర్చారు. "Light up the everyday" అనే ట్యాగ్‌లైన్ కింద వస్తున్న ఈ కొత్త డిజైన్ ప్రధానంగా నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్ వంటి ప్రాథమిక అలర్ట్‌లను చూపించడానికి మాత్రమే ఉపయోగపడనుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం, ఫ్రాన్స్‌లో EUR 249.99 (సుమారు రూ.25,700) ప్రారంభ ధరగా ఉండొచ్చు. కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇది కొంచెం తక్కువగా, EUR 239.99 (రూ.24,700) వద్ద కూడా లభించవచ్చు. యూరప్‌లో నవంబర్ 4 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కొన్ని రిపోర్ట్‌లు దీని ధర రూ.18,999 నుండి రూ.22,999 మధ్య ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ బ్లాక్ & వైట్ రంగుల్లో అందుబాటులో వుంది. 6.77 అంగుళాల Full HD+ AMOLED LTPS డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉండనున్నాయి. ఈ డివైజ్ MediaTek Dimensity 7300 లేదా Dimensity 7300 Pro చిప్‌సెట్, Mali-G615 MC2 GPUతో వస్తుందని అంచనా. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 తో రన్ అయ్యే ఫోన్. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం నథింగ్ ఫోన్ 3a లైట్ Android 15 OSపై రన్ అవుతుంది. ఇది సింగిల్ కోర్ టెస్టుల్లో 1,003 పాయింట్లు, మల్టీకోర్ టెస్టుల్లో 2,925 పాయింట్లు సాధించింది. ఈ బడ్జెట్ మోడల్ అయినప్పటికీ, కెమెరా విభాగంలో నథింగ్ రాజీ పడలేదు. వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ (30fps) సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పవర్ కోసం ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
0 Comments